అక్షరటుడే, కామారెడ్డి: Collector Kamareddy | విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) సూచించారు. నషాముక్త్ భారత్ అభియాన్ (Nashamukt Bharat Abhiyan) కార్యక్రమాన్ని ప్రారంభించి ఆగష్టు 13వ తేదీతో ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree college) మాదకద్రవ్య నివారణపై (Drug prevention) ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడొద్దని.. సరైన దారిలో వెళ్లాలని సూచించారు. చాలామంది యువకులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగం కట్టడి చేయడం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.
జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం తగ్గించడానికి జిల్లా సంక్షేమ, ఎక్సైజ్ శాఖ (Excise Department) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హన్మంత్ రావు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Collector Kamareddy | పోలీసులతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్పీ
నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ తో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మాదక ద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), ఏఎస్పీ చైతన్య రెడ్డి పాల్గొని పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు.
పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్పీ రాజేష్ చంద్ర