భీమ్గల్, అక్షరటుడే : Bheemgal Police | విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని భీమ్గల్ ఎస్సై సందీప్ సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (Government Junior College) పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో శనివారం సైబర్ భద్రత, మాదకద్రవ్యాల నివారణ, సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Bheemgal Police | మంచీచెడులపై అవగాహన ఉంచడాలి..
ఈ సందర్భంగా ఎస్సై సందీప్ (SI Sandeep) మాట్లాడుతూ.. నేటి కాలంలో బాలబాలికలపై జరుగుతున్న అకృత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న విద్యార్థినులు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మంచి చెడులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఏఆర్ ఎస్సై శ్రీనివాస్ (AR Sub-Inspector Srinivas)మాట్లాడుతూ.. ఇంటర్ దశ జీవితానికి అత్యంత కీలకమన్నారు. ఈ సమయంలో గందరగోళానికి లోనుకాకుండా చదువుపై ఏకాగ్రత వహించాలన్నారు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. ఆన్లైన్ గేమ్స్, సైబర్ నేరాల (Cyber Crimes) పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Bheemgal Police | రోడ్డు భద్రత.. బాధ్యత
వాహనదారులు బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని పోలీసులు పేర్కొన్నారు. ట్రిపుల్ రైడింగ్ (Triple Riding) చట్టరీత్యా నేరమని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ సి.జయపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సెల్ఫోన్లకు దూరంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని తెలిపారు. కళాశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ, విద్యపైనే దృష్టి సారించాలని కోరారు. విద్యార్థులు తమ జీవితాలను సక్రమ మార్గంలో నడిపిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ మండలోజు నర్సింహ స్వామి, పల్లె శ్రీనివాస్ గౌడ్లు, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య, కానిస్టేబుల్ విక్రమ్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.