Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Degree College | విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు ఎదగాలి

Kamareddy Degree College | విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు ఎదగాలి

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Degree College | కామారెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రిన్సిపల్​ విజయ్​కుమార్​ పేర్కొన్నారు. కళాశాలలో మంగళవారం ఎంఏ తెలుగు ఫస్టియర్​ విద్యార్థులు సెకండియర్​ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య​అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి డిగ్రీ కళాశాలకు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. గొప్ప చరిత్ర కలిగిన కళాశాలలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (Master of Arts) అభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య, తెలుగు శాఖ అధ్యక్షుడు డా.విశ్వప్రసాద్, కళాశాల ఐక్యూఏసీ IQAC కోఆర్డినేటర్ డా. జయప్రకాశ్, హిందీ శాఖ అధ్యక్షులు డా. శ్రీనివాసరావు, తెలుగు శాఖ అధ్యాపకులు రవి కుమార్, మల్లేష్, ఆంజనేయులు డా.రమేష్, డా.సత్యం విద్యార్థులు పాల్గొన్నారు.