అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Mandal | ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి ప్రమీల (Mandal Special Officer Pramila) అధికారులకు సూచించారు.
నిజాంసాగర్ మండలకేంద్రంలోని కేజీబీవీ (KGBV), అచ్చంపేటలోని గురుకుల పాఠశాలను (Gurukul School) శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఉపాధ్యాయులు సైతం సమయపాలన పాటించాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో గంగాధర్ ఉన్నారు.