అక్షరటుడే, ఎల్లారెడ్డి: Government Degree College | విద్యార్థులు చదువుతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడంలో నైపుణ్యం సాధించాలని టాస్క్ జిల్లా మేనేజర్ రఘు తేజ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం టాస్క్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అకడమిక్ విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి సాధించాలన్నారు. ఈ సందర్భంగా టాస్క్(Telangana Academy for Skill and Knowledge) అందించే శిక్షణ కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి ఉద్యోగపరమైన అవగాహన కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు టాస్క్ వంటి వేదికల ద్వారా తమ సామర్థ్యాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం. చంద్రకాంత్, IQAC కోఆర్డినేటర్ డా.శంకరయ్య, TASK కోఆర్డినేటర్ శివ, మెంటర్ రాజు పాల్గొన్నారు.