అక్షరటుడే, బోధన్: Bodhan | విద్యార్థులు చదువులో బాగా రాణించాలని మైనార్టీ రెసిడెన్షియల్ సెక్రెటరీ షఫీయుల్లా (Minority Residential Secretary Shafiullah) అన్నారు. బోధన్ పట్టణంలోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలో (Residential Schools) పౌష్టికాహారంతో అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి తమ పాఠశాలకు, సిబ్బందికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అలాగే నూతనంగా నిర్మించిన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్ఎల్సీ బషీర్ అలీ, డీఎండబ్ల్యూవో కృష్ణవేణి, మైనార్టీ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ పద్మజ, కళాశాల సిబ్బంది ఉన్నారు.