అక్షరటుడే, డిచ్‌పల్లి: ABVP | విద్యార్థులు జాతీయవాద భావం అలవర్చుకోవాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గసభ్యుడు శివ అన్నారు. డిచ్‌పల్లి (Dichpally)శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎస్‌పీఆర్ (SPR) ఇంటర్, డిగ్రీ కళాశాలలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏబీవీపీ సభ్యత్వ నమోదు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీయడంతో పాటు సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ఏబీవీపీ కీలకంగా పనిచేస్తుందన్నారు. 1949లో ఐదుగురితో ప్రారంభమై 55 లక్షల సభ్యులతో దేశం కోసం విద్యార్థుల కోసం సంఘం పని చేస్తుందన్నారు.
జిల్లాలోనూ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ఏబీవీపీ ముందుంటుదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ(Telangana University) సెక్రెటరీ సమీర్, జాయింట్ సెక్రటరీ లెనిన్ అనిల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు నెహ్రు, రామకృష్ణ, హర్ష నందన్, తదితరులు పాల్గొన్నారు.