Homeజిల్లాలుకామారెడ్డిCollector Kamareddy | విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

Collector Kamareddy | విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

- Advertisement -

అక్షరటుడే, గాంధారి: Collector Kamareddy | మండల కేంద్రంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) మంగళవారం పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శిథిలమైన ఆర్​అండ్​బీ రోడ్లు, వంతెనలు, కల్వర్టులను ఆయన పరిశీలించారు.

గుర్జాల్​ తండాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. తర్వాత విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించి వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఐదో తరగతి విద్యార్థులకు కలెక్టర్​ నోట్​పుస్తకాలను పంపిణీ చేశారు.

అంతేకాకుండా స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీపీవో మురళి (DPO Murali), డీఎల్పీవో సురేందర్, ఎంపీడీవో రాజేశ్వర్, తహశీల్దార్​ రేణుకా చౌహన్, ఎంపీవో లక్ష్మీనారాయణ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.