Deo Ashok | సెలవుల్లోనూ విద్యార్థులు చదువుకునేలా చూడాలి

అక్షరటుడే, బాన్సువాడ:Deo Ashok | వేసవి సెలవుల్లో విద్యార్థులు(Students) ఇంటివద్ద చదవడం, రాయడం ప్రాక్టీస్​ చేయాలని.. సెల్​ఫోన్లకు(Cellphones) దూరంగా ఉండాలని డీఈవో అశోక్(DEO Ashok)​ సూచించారు. మండలంలోని బోర్లం ప్రాథమిక పాఠశాల(Borlam Primary School)లో బుధవారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చదువే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాల(Government Schools)ల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని.. వాటిని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్​ఎం వెంకటరమణ, ప్రాథమిక […]

అక్షరటుడే, బాన్సువాడ:Deo Ashok | వేసవి సెలవుల్లో విద్యార్థులు(Students) ఇంటివద్ద చదవడం, రాయడం ప్రాక్టీస్​ చేయాలని.. సెల్​ఫోన్లకు(Cellphones) దూరంగా ఉండాలని డీఈవో అశోక్(DEO Ashok)​ సూచించారు. మండలంలోని బోర్లం ప్రాథమిక పాఠశాల(Borlam Primary School)లో బుధవారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చదువే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాల(Government Schools)ల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని.. వాటిని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్​ఎం వెంకటరమణ, ప్రాథమిక పాఠశాల హెచ్​ఎం గోపి, ఉపాధ్యాయులు అయ్యల సంతోష్, చైతన్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...