అక్షరటుడే, ఇందల్వాయి: Seasonal diseases | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ (Health Extension Officer Y. Shankar) సూచించారు. తిర్మన్పల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, బాలికల కళాశాలలో ఇందల్వాయి పీహెచ్సీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.
Seasonal diseases | దోమలతో జాగ్రత్త..
ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి మాట్లాడుతూ.. దోమల వల్ల వ్యాపించే వ్యాధులపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దోమల వల్ల మలేరియా, డెంగీ, చికున్ గున్యా, ఫైలేరియా, మెదడువాపు లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని వివరించారు. పాఠశాల చుట్టూ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్ పద్మజకు సూచించారు.
Seasonal diseases | పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
విద్యార్థులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తాజా ఆకుకూరలు, కూరగాయలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని ప్రతిరోజు పాలు, గుడ్లు ఖచ్చితంగా ఆహారంలో ఉండేట్లు చూసుకోవాలని శంకర్ వివరించారు. బెల్లం పల్లీలు, మునగ ఆకులు, మునగ కాడలు తింటే ఆరోగ్యంగా ఉంటారని స్పష్టం చేశారు. పాఠశాలలో సాయంత్రం ఇచ్చే ఉడకపెట్టిన పల్లీలు, బఠానీలు, శనిగలు తినాలని వాటిలో బీకాంప్లెక్స్ అధికంగా ఉంటుందని వివరించారు.
Seasonal diseases | పండ్లలో అనేక పోషక విలువలు..
పండ్లల్లో అనేక పోషక విలువలు ఉంటాయని ఆరోగ్య విస్తరణ అధికారి పేర్కొన్నారు. ఆరెంజ్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుందని వివరించారు. సూర్యరశ్మిలో విటమిన్–డి లభిస్తుందని తెలిపారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల విద్యార్థులు మానసికంగా శారీరకంగా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని వివరించారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌సీ డాక్టర్ వినీత్, ఆరోగ్య కార్యకర్తలు శారద, భానుప్రియ, ఆశా కార్యకర్తలు ప్రమీల, జ్యోతి, ప్రియాంక పాల్గొన్నారు.