అక్షరటుడే, కమ్మర్పల్లి : CPR | సీపీఆర్‌పై విద్యార్థులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని ప్రభుత్వ వైద్యురాలు హసీనా సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు సీపీఆర్‌పై (Cardio Pulmonary Resuscitation) అవగాహన కల్పించారు.
విద్యార్థులకు ప్రాక్టికల్‌గా సీపీఆర్ (CPR) ఏవిధంగా చేయాలో చేసి చూపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అయోడిన్ కొరత వల్ల థైరాయిడ్ సమస్యలు (Thyroid Problems) వస్తాయని వివరించారు. అయోడైజ్డ్ ఉప్పును వాడాలని సూచించారు. ఇది పిల్లల్లో పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. రోజూ ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవద్దని చెప్పారు.
ఎవరైనా గుండెపోటుకు గురయితే సరైనా సమయంలో స్పందించి సీపీఆర్ చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడినట్లు అవుతుందని డాక్టర్ వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయపాల్ రెడ్డి, అధ్యాపకులు మధు, రాజకుమార్, వైష్ణవి, గంగాధర్, మహేందర్, శ్రీహరి, మురళీకృష్ణ, గంగారాం, హాస్పిటల్ సూపర్వైజర్ పద్మలత, ఏఎన్ఎంలు స్వరూప, కృష్ణవేణి పాల్గొన్నారు.
