అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఉపాధ్యాయులు ప్రచారం చేశారు. బటిబాట (Badibaata) కార్యక్రమం మండలంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళా, యువజన సంఘాల సభ్యులు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన జరుగుతుందని, సకల సౌకర్యాలు ఉంటాయని వారు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
