అక్షరటుడే,గాంధారి: Gandhari | ప్రభుత్వ కళాశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని అధ్యాపకులు ప్రచారం నిర్వహించారు. గాంధారి మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల (Government Junior College) ప్రిన్సిపాల్ గంగారాం ఆధ్వర్యంలో అధ్యాపకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.
ఉచిత పుస్తకాల పంపిణీ, బస్సు సౌకర్యం, స్కాలర్షిప్ సౌకర్యాలున్నాయని, ఉత్తమ విద్య సైతం ప్రభుత్వ కళాశాలల్లోనే దొరుకుతుందని వారు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లెక్చరర్లు రాజగోపాల్, లక్ష్మణ్, విజయ్ కుమార్, రమేష్, సరిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.