Homeజిల్లాలునిజామాబాద్​Kabaddi tournament | రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థుల ఎంపిక

Kabaddi tournament | రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లాకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఆలూర్​ ఉన్నత పాఠశాల విద్యార్థి వాస్తవ్​, ఇందల్వాయి జడ్పీహెచ్​ఎస్​ విద్యార్ధిని కసుమ, మిర్దాపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని శిరీష సెలెక్ట్​ అయ్యారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్/ఇందల్వాయి: Kabaddi tournament | ఆలూరు ఉన్నత పాఠశాలకు చెందిన వాస్తవ్ అనే విద్యార్థి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు (state-level kabaddi competitions) ఎంపికైనట్లు పాఠశాల పీడీ రాజేష్ తెలిపారు.

ముప్కాల్ మండలంలో (Mupkal Mandal) జరిగిన 69వ ఎస్జీఎఫ్​ అండర్-17 బాలబాలికల కబడ్డీ జిల్లస్థాయి పోటీల్లో వాస్తవ్ ఉత్తమ ప్రతిభ కనబర్చాడన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాల కబడ్డీ టోర్నమెంట్​కు ఎంపికయ్యాడని తెలిపారు. అలాగే కామారెడ్డి బాయ్స్ హైస్కూల్​లో (Kamareddy Boys High School) జరిగిన ఉమ్మడి జిల్లాల కబడ్డీ సెలక్షన్స్​లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పీడీ తెలిపారు. ఎంపికైన విద్యార్థిని పాఠశాల హెడ్మాస్టర్, ఎంఈవో నరేందర్, ఉపాధ్యాయులు అభినందించారు.

Kabaddi tournament | ఇందల్వాయి పాఠశాల విద్యార్థిని..

ఇందల్వాయి మండలంలోని (Indalwai Mandal) జడ్పీహెచ్​ఎస్​ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న వి.కుసుమ ఎస్జీఎఫ్​ అండర్–17 కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందని పాఠశాల హెచ్​ఎం వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం వివరాలు వెల్లడించారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల 7 నుంచి 9 వరకు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరుగనున్నాయని వివరించారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని కుసుమ, ఇందుకు కృషి చేసిన పీఈటీ భూపతి రాజేశ్వర్​ను హెచ్​ఎం, ఉపాధ్యాయ బృందం సన్మానించింది.

Kabaddi tournament | ఆలూర్​ మండలంలో..

ఆలూర్​ మండలం మిర్దాపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని శిరీష రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు సుజాత తెలిపారు. ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సీనియర్ ఖోఖో పోటీల్లో ప్రతిభ చాటి శిరీష రాష్ట్రస్థాయికి ఎంపికైందని వివరించారు. కాగా.. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థినిని పాఠశాల హెచ్​ఎం నరేందర్ రావు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు.