అక్షరటుడే,డిచ్పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలోని హెల్త్‌కేర్ సెంటర్ (Healthcare Center) ఎదుట సోమవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు.
సెంటర్లో పూర్తిస్థాయిలో ఔషధాలను అందుబాటులో ఉంచాలని వర్సిటీ ఏబీవీపీ(ABVP) విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్, రిజిస్టార్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ మేరకు యూనివర్సిటీ ఏబీవీపీ కార్యదర్శి సమీర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం పేరుతో ఉన్న ఈ యూనివర్సిటీలో కనీసం హెల్త్ సెంటర్ నిర్వహణ లేకపోవడం బాధాకరమని, సెంటర్లో పూర్తిస్థాయి మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
Telangana University | రెగ్యులర్ వైద్యుడిని అందుబాటులో ఉంచాలి..
24 గంటలపాటు రెగ్యులర్ డాక్టర్‌ను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. ఆందోళన విషయం తెలుసుకున్న రిజిస్టార్ యాదగిరి (TU Registrar Yadagiri) విద్యార్థి నాయకుల దగ్గరికి చేరుకొని వారితో చర్చించారు. పూర్తిస్థాయి వసతుల కల్పనకు వైస్ ఛాన్స్లర్ యాదగిరి రావుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో వర్సిటీ ఏబీవీపీ విద్యార్థి నాయకులు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హెల్త్‌కేర్ సెంటర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు