Homeజిల్లాలునిజామాబాద్​Balkonda | పోలీస్ శాఖ​ విధులపై విద్యార్థులకు అవగాహన

Balkonda | పోలీస్ శాఖ​ విధులపై విద్యార్థులకు అవగాహన

పోలీసులు నిర్వర్తించే విధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాక్లూర్​ మండల కేంద్రంలోని పోలీస్​స్టేషన్​లో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, బాల్కొండ: Balkonda | మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జెడ్పీ హైస్కూల్‌తో పాటు (ZP High School) కేజీబీవీ, మైనారిటీ గురుకుల పాఠశాలల విద్యార్థులకు పోలీసుల విధులు, ఆయుధాల వినియోగం, రికార్డుల నిర్వహణ, తదితర పోలీసు సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఎస్‌హెచ్‌వో శైలేందర్‌ (SHO Shailender) మాట్లాడుతూ.. ఓపెన్‌హౌస్‌ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీసుల పనితీరు, ప్రజలకు అందించే సేవలు, సైబర్‌ నేరాల (cyber crimes) నివారణ పద్ధతులు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్, డయల్‌ 100, షీ టీమ్స్‌ వంటి సేవలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంఈవో బట్టు రాజేశ్వర్, జెడ్పీ పాఠశాల హెచ్‌ఎం ప్రశాంత్‌ కుమార్, వేల్పూర్‌ శ్రీనివాస్, కేజీబీవీ ఎస్‌వో భవాని, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.