అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chittoor | ప్రస్తుతం సమాజంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ప్రేమ, డబ్బు కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. చదువు చెప్పే టీచర్లను గౌరవించే రోజులు పోయాయి. అలాగే విద్యార్థులతో కూడా కొందరు టీచర్లు సరిగా ప్రవర్తించడం లేదు. ఇటీవల పాఠాలు చెప్పి సాయం చేసిన ఓ గురువును విద్యార్థిని బ్లాక్ మెయిల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాలేజీ ల్యాబ్ టెక్నిషియన్(College Lab Technician)గా పనిచేస్తున్న మహిళ(38)తో ఓ విద్యార్థి (19) ప్రేమలో పడ్డాడు.
Chittoor | ఇంటర్న్‌షిప్ అని చెప్పి..
చిత్తూరులో ఓ ప్రైవేటు కాలేజీ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మహిళతో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి(BTech First Year Student)(19) ప్రేమలో పడ్డాడు. సదరు మహిళ భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటూ కాలేజీలో పని చేస్తోంది. మే 24న బెంగళూరు(Bangalore)లో ఇంటర్న్‌షిప్ కోసం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఆమెతో విద్యార్థి వెళ్లిపోవడం గమనార్హం. ఎంతకు తమ కుమారుడు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో కాలేజీలో ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బెంగళూరులో ఉన్న ఇద్దరిని చిత్తూరు(Chittoor)కు తీసుకొచ్చారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపించారు.
Chittoor | సమాజం ఎటు పోతుందో..
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. దీంతో పాఠశాల విద్యార్థులు కూడా సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. చిన్న పిల్లలు సైతం ఫోన్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి ఉంది. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా మోజులో చాలా మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాకు బానిసలుగా మారి చిన్న వయసులోనే ప్రేమ అంటూ.. కెరీర్‌పై దృష్టి పెట్టడం లేదు. దీంతో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
మరికొందరు మద్యం, డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. యువత చెడుదారులు పడుతుండటం దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పిల్లలకు ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులు వారు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టాలని సూచిస్తున్నారు.