Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | ట్రాఫిక్​ నియమాలపై విద్యార్థుల ప్రదర్శన భేష్: కలెక్టర్​

Kamareddy | ట్రాఫిక్​ నియమాలపై విద్యార్థుల ప్రదర్శన భేష్: కలెక్టర్​

రోడ్డు ప్రమాదాలకు కారణాలను వివరించేందుకు విద్యార్థుల ప్రదర్శన భేష్ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 'కిడ్స్ విత్ ఖాకీ' కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రోడ్డు ప్రమాదాలకు కారణాలను వివరించేందుకు విద్యార్థుల ప్రదర్శన భేష్ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. చిల్డ్రన్స్ డే (Children’s Day) సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిజాంసాగర్ చౌరస్తాలో కిడ్స్ విత్ ఖాకీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా చౌరస్తా వద్ద పాఠశాలల విద్యార్థులు పలు ప్రదర్శనలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ (drunk and drive) ద్వారా జరిగే ప్రమాదాలు, హైస్పీడ్ వల్ల జరిగే ప్రమాదాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు. అలాగే ప్రమాదాల వల్ల చనిపోయే కుటుంబాల వ్యథ ఎలా ఉంటుంది. ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందనే వివరాలను తమ ప్రదర్శనల ద్వారా వివరించారు. అలాగే ‘సేఫ్ కామారెడ్డి’ (Safe Kamareddy) అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్ వ్యవస్థ (police system) పకడ్బందీగా పనిచేస్తుందన్నారు. ఎప్పటికప్పుడు వాహనదారులకు అవగాహన కల్పించడం, తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గిందన్నారు. ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.

Kamareddy | విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు: ఎస్పీ రాజేష్ చంద్ర

రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి మిగతా వారికి అవగాహన కల్పించేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు బాగుందని, ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్​పై అవగాహన చేపట్టామన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి కలెక్టర్, ఎస్పీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీఐలు, ఎస్సైలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Must Read
Related News