అక్షరటుడే, డిచ్పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పీడీఎస్యూ (PDSU), టీయూసీఐ (TUCI) ఆధ్వర్యంలో ఘన్పూర్(Ghanpur)–డిచ్పల్లి రోడ్డుపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా నాయకులు మురళి మాట్లాడుతూ.. డిచ్పల్లి (Dicpally) మండలంలో ఘన్పూర్, ఇస్లాంపూర్ నుంచి 60 మంది విద్యార్థులు మోడల్ స్కూల్లో చదువుకుంటున్నారన్నారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఆర్టీసీ బస్సు డిచ్పల్లి మీదుగా అన్ని గ్రామాలు తిరిగి ఘన్పూర్కు వచ్చేసరికి సుమారు గంట ఆలస్యం అవుతోందన్నారు. దీంతో విద్యార్థులు నిత్యం తరగతులకు లేటుగా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘన్పూర్, ఇస్లాంపూర్ మీదుగా మోడల్ స్కూల్ వరకు ప్రత్యేకంగా ఒక బస్సు నడపాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో పీడీఎస్యూ నాయకులు కార్తీక్, బబ్లు, కీర్తన, అవంతిక, ఆదిశ్రీ, తేజు, మురళీధర్, నవతేజ, TUCI నాయకులు రాములు, అశోక్, ప్రవీణ్, రమేష్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.