అక్షరటుడే, ఆర్మూర్: CPR | ఆలూర్ (Aloor) మండలం కల్లడి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన (CPR Awareness Camp) కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ ప్రకాశ్ ఆధ్వర్యంలో సీపీఆర్ చేసే విధానంపై అవగాహన కల్పించారు.
ఎవరైనా ఆకస్మిక గుండెపోటు (Heart attack), ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, రోడ్డు ప్రమాదాల బారిన పడితే, అలాంటివారికి అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు.
కొన్ని సందర్భాల్లో వ్యక్తి గుండె కొద్దిసేపు కొట్టుకోవడం ఆగితే, వెంటనే సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాపాయం తప్పించవచ్చన్నారు. ఈ మేరకు సీపీఆర్‌పై విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికి సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం నాగరాజు, పంచాయతీ సెక్రెటరీ శేఖర్, శ్రీనివాస్, మహేష్, శివ, విద్యార్థులు పాల్గొన్నారు.