ePaper
More
    HomeజాతీయంHelicopter to exam center | హెలికాప్టర్​లో ఎగ్జామ్ సెంటర్​కు స్టూడెంట్స్.. అద్దెకు తీసుకుని మరీ..!

    Helicopter to exam center | హెలికాప్టర్​లో ఎగ్జామ్ సెంటర్​కు స్టూడెంట్స్.. అద్దెకు తీసుకుని మరీ..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helicopter to exam center : ఇటీవల ఓ విద్యార్థిని తాను చదివే విద్యాసంస్థకు గుర్రంపై వెళ్లి వైరల్​ అయింది. ఇలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది.

    కాకపోతే ఈ విద్యార్థులు ఏకంగా హెలికాప్టర్​లో వెళ్లారు. అదీనూ దానిని అద్దెకు తీసుకుని మరీ వెళ్లారు. కొండ చరియలు  విరిగిపడి రోడ్లు మూసుకుపోవడంతో ఇలా పయనించారు.

    బీఎడ్ చదువుతున్న రాజస్థాన్​కు చెందిన నలుగురు విద్యార్థులు ఉత్తరాఖండ్​ Uttarakhand లోని పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది.

    వీరి పరీక్ష కేంద్రం మున్సియారిలో ఉంది. ఉత్తరాఖండ్ లో భారీ వర్షం కురువడంతో కొండచరియలు విరిగిపడి ఎగ్జామ్ సెంటర్ exam center కు వెళ్లే రోడ్లన్ని మూసుకుపోయాయి.

    దీంతో సదరు విద్యార్థులు హెలికాప్టర్​ను అద్దెకు తీసుకున్నారు. అందులో మున్సియారి Munsiyari లోని పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.

    రాజస్థాన్ బలోత్రా పట్టణానికి చెందిన విద్యార్థులు ఉత్తరాఖండ్ ఓపెన్ వర్సిటీ ఎగ్జామ్ రాయాల్సి ఉంది. వీరి పరీక్ష కేంద్రం మున్సియారిలోని ఆర్ఎస్ టోలియా పీజీ కాలేజీలో పడింది.

    దీంతో ఈ విద్యార్థలు ఆగస్టు 31న హల్వానీకి వెళ్లారు. అయితే, ఉత్తరాఖండ్​లో భారీ వర్షాలు కురవడం వల్ల పలుచోట్ల కొండచరియలు landslides విరిగిపడ్డాయి.

    Helicopter to exam center : కొండ చరియలు విరిగిపడటంతో..

    హల్ద్వానీ నుంచి మున్సియారీకి వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడటంతో రహదారులు మూసుకుపోయాయి.

    దీంతో పరీక్ష కేంద్రానికి వెళ్లడమే విద్యార్థులకు అతి పెద్ద పరీక్షగా మారింది. సెంటర్​కు ఎలా వెళ్లాలో తెలియక విద్యార్థులు మదనపడ్డారు.

    కాగా హల్ద్వానీ నుంచి మున్సియారికి హెలికాప్టర్ ఫెసిలిటీ ఉందని విద్యార్థులకు స్థానికులు తెలిపారు. దీంతో సదరు హెరిటేజ్ ఏవియేషన్ సంస్థ గురించి తెలుసుకున్నారు.

    కానీ, ప్రతికూల వాతావరణం ఉండటంతో ఆ సంస్థ సైతం హెలికాప్టర్ నడపడం లేదని తెలిసింది. దీంతో కంపెనీ సీఈవోని సంప్రదించారు.

    తమ సమస్యను విన్నవించి అభ్యర్థించారు. దీంతో ఒక హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లను ఇచ్చి పంపించారు ఆ సీఈవో.

    అలా విద్యార్థులు హెలికాప్టర్​లో మున్సియారీకి వెళ్లి పరీక్ష రాసి, తిరిగి హల్ద్వానీకి వచ్చేశారు. ఒకవైపు హెలికాప్టర్ ప్రయాణానికి రూ.5,200 అయినట్లు విద్యార్థలు తెలిపారు.

    More like this

    BC Declaration | బీసీ డిక్లరేషన్ సభాస్థలిని పరిశీలించిన మంత్రుల బృందం

    అక్షరటుడే, కామారెడ్డి: BC Declaration |  బీసీ డిక్టరేషన్​ అమలు సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కాంగ్రెస్​ పార్టీ సమాయత్తమైంది....

    Laddu Auction | వెల్లివిరిసిన మ‌త సామ‌ర‌స్యం.. వేలంలో ల‌డ్డూని సొంతం చేసుకున్న ముస్లిం మ‌హిళ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Laddu Auction | దేశమంతటా వినాయక చవితి ఉత్సవాలు ఉత్సాహభరితంగా, భక్తి శ్రద్ధలతో సాగాయి. ఈ...

    Heavy Rains | వరంగల్‌లో కుండపోత వర్షం.. వ‌ర‌ద‌లో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | వరంగల్ (Warangal) నగరంలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది....