అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | కోతుల (Monkey) మీదకు వస్తున్నాయనే భయంతో ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకింది. తీవ్రగాయాలవడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దుబ్బ (Dubba) ప్రాంతానికి చెందిన కావేరి ఆర్మూర్ మండలం మామిడిపల్లి (Mamidipally) వద్ద కేజీబీవీ కళాశాలలో(KGBV college) ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. బంగ్లాపై ఉన్న హాస్టల్లో ఉంటున్న విద్యార్థి వాష్రూమ్ కోసమని బయటకు వచ్చింది. బిల్డింగ్పై కోతుల మందను చూసిన కావేరి ఒక్కసారిగా ఉలిక్కిపడి భవనం పైనుంచి దూకేసింది.
గమనించిన విద్యార్థులు స్థానికుల సహాయంలో హుటాహుటిన కావేరిని సోమవారం రాత్రి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థి బుధవారం ఉదయం మృతి చెందింది. విద్యార్థిని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
