HomeUncategorizedStudent Visa | ప్రొఫైల్ "ప‌బ్లిక్" చేస్తేనే విద్యార్థి వీసాలు.. అమెరికా రాయ‌బార కార్యాల‌య ప్ర‌క‌ట‌న‌

Student Visa | ప్రొఫైల్ “ప‌బ్లిక్” చేస్తేనే విద్యార్థి వీసాలు.. అమెరికా రాయ‌బార కార్యాల‌య ప్ర‌క‌ట‌న‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Student Visa | విద్యార్థి వీసాల జారీని ఇటీవ‌ల పున‌రుద్ధరించిన అమెరికా.. తాజాగా ద‌రఖాస్తుదారులకు ష‌ర‌తులు విధించింది. ప్ర‌ధానంగా ద‌ర‌ఖాస్తు ప్ర‌తి ఒక్క‌రూ త‌మ సోష‌ల్ మీడియా ప్రొఫైల్స్‌ను “ప్రైవేట్‌” గా ఉంచ‌కూడ‌ద‌ని, “ప‌బ్లిక్‌”గా మార్చాల‌ని స్ప‌ష్టం చేసింది. ఆయా అకౌంట్ల‌ను ప‌రిశీలించిన త‌ర్వాతే వీసా జారీ చేస్తామ‌ని అమెరికా ప్ర‌క‌టించింది. తమ దేశ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన భార‌త్‌లోని అమెరికా రాయ‌బార కార్యాల‌యం(US Embassy).. ఈ ప్రక్రియ వెంటనే అమలులోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించింది. అమెరికా వీసా(US visa)కు దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరు తమ సోషల్ మీడియా అకౌంట్లను “పబ్లిక్” గా మార్చాలని యూఎస్ ఎంబ‌సీ సూచించింది.

Student Visa | ప్రొఫైల్‌ను మార్చాల్సిందే..

చాలా మంది విద్యార్థులు త‌మ సోష‌ల్ మీడియా ప్రొఫైల్‌ను ప్రైవేట్‌గా ఉంచుకుంటారు. అయితే, ఇలాంటి వారు అమెరికా వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఇప్పుడు ప్రొఫైల్‌ను ప‌బ్లిక్(Profile Public) గా మార్చాల్సి ఉంటుంది. లేక‌పోతే వీసా జారీ కాదు. ట్రంప్(Donald Trump) రెండోసారి అధికారం చేప‌ట్టాక త‌మ దేశంలో అక్ర‌మ వ‌ల‌స‌ల‌పై ఉక్కుపాదం మోపారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అగ్ర‌రాజ్యంలో ఉంటున్న వివిధ దేశాల పౌరుల‌ను బ‌ల‌వంతంగా అక్క‌డి నుంచి పంపించేశారు.

ఈ నేప‌థ్యంలో కొద్దిరోజుల పాటు అమెరికా స్టూడెంట్ వీసాల జారీని నిలిపి వేసింది. ఇటీవ‌లే తిరిగి వీసా ద‌ర‌ఖాస్తుల ప్రాసెస్‌ను ప్రారంభించింది. అయితే, వీసా కోసం ద‌ర‌ఖాస్తు ప్ర‌తి ఒక్క‌రి సోష‌ల్ మీడియా ప్రొఫైల్‌(Social Media Profile)ను త‌నిఖీ చేశాకే వీసాలు మంజూరు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి విద్యార్థి త‌మ ప్రొఫైల్‌ను “ప‌బ్లిగ్‌”గా మార్చుకోవాల‌ని సూచించింది. F, M, లేదా J నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరూ త‌మ సోషల్ మీడియా ఖాతాలను బహిరంగంగా యాక్సెస్ చేయగలరని నిర్ధారించుకోవాలని రాయబార కార్యాలయం “ఎక్స్‌”లో పేర్కొంది. ఈ చర్య డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పరిపాలనలో వీసా త‌మ దేశ భద్రతను మెరుగుపరచడానికి, సమగ్రతను నిర్ధారించడానికి చేస్తున్న‌ ప్రయత్నాల్లో భాగమ‌ని తెలిపింది.

Student Visa | సోష‌ల్ మీడియా ఖాతాలు ప‌రిశీలించాకే..

అభ్య‌ర్థుల సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను ప‌రిశీలించిన తర్వాతే అమెరికా వీసాలు జారీ చేయ‌నుంది. Facebook, X (గతంలో Twitter), LinkedIn, TikTok, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో దరఖాస్తుదారుల ఆన్‌లైన్ కార్యకలాపాలను క్షుణ్ణంగా సమీక్షించనున్న‌ట్లు అమెరికా ఎంబ‌సీ తెలిపింది. “జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి” సోషల్ మీడియా డేటాను ఉపయోగించడం చాలా కీలకమని US పేర్కొంది. 2019 నుండి, వీసా దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారమ్‌లలో వారి సోషల్ మీడియా ఐడెంటిఫైయర్‌లను అందించాల్సి ఉందని రాయబార కార్యాలయం పేర్కొంది.