Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలి

Yellareddy | విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలి

విద్యార్థులు బాగా చదువుకుని దేశానికి ఉపయోగపడే పనులు చేయలని ఎంఐఎం ప్రతినిధులు అన్నారు. ఎల్లారెడ్డి మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, పాఠశాలలో అబుల్​ కలాం ఆజాద్​ జయంతిని నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | విద్యార్థులు బాగా చదువుకుని సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని ఎంఐఎం కామారెడ్డి జిల్లా కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ రజాక్ అన్నారు.

ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, పాఠశాలలో ఎడ్యుకేషన్ డే, మైనారిటీ వెల్ఫేర్ డే, భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్​ రజాక్​ మాట్లాడుతూ.. మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు.

Yellareddy | విప్లవబాటను వీడి.. అహింసామార్గంలో..

1920 జనవరిలో మహాత్మాగాంధీని (Mahatma Gandhi) కలుసుకున్నాక తన విప్లవ బాటను వీడి అహింసా మార్గంలో నడిచారని రజాక్​ వివరించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారన్నారు. అబుల్‌ కలాం పండితుడిగా, ధార్మికవేత్తగా ఖ్యాతిని ఆర్జించారని చెప్పారు.

జాతీయోద్యమం దిశగా ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ‘అల్‌ హిలాల్‌’, ‘అల్‌ బలాగ్‌’ లాంటి ఉర్దూ పత్రికలను వెలువరించారన్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని కలవరపెట్టిన ఈ పత్రికలు పలుమార్లు నిషేధానికి గురయ్యాయన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేశ్, ఎల్లారెడ్డి మైనారిటీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఘాయజుద్దీన్, ఎల్లారెడ్డి మండల ఎంపీడీవో తాహీరా బేగం, ఎల్లారెడ్డి ఎంపీవో ప్రకాష్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ సయ్యద్​ మీర్​, సీనియర్ పాత్రికులు గౌష్ అలీ ఖమౌష్, మహమ్మద్ షఫీ నిజామీ పాల్గొన్నారు.

Must Read
Related News