అక్షరటుడే, ఇందూరు : Student Science Exhibition | విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీస్తూ, సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. నగర శివారులోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్లో (Navya Bharati Global School) యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ యాక్షన్ పేరుతో గురువారం ‘ఆవిష్కార్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Student Science Exhibition | విద్యార్థుల ప్రదర్శనలు అభినందనీయం..
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, సోలార్ వినియోగం (Solar usage), పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే సాధనాలు, కాలుష్య నియంత్రణ (Pollution Control), ట్రాఫిక్ నిబంధనలు (Traffic Regulations), అంతరిక్ష పరిశోధన నమూనాలు తదితర అంశాలపై విద్యార్థుల ప్రదర్శనలు అభినందనీయమన్నారు. కేవలం తరగతి గది, పుస్తకాలకే పరిమితం కాకుండా అనేక అంశాలలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటడం ఎంతో గొప్ప విషయమన్నారు.
Student Science Exhibition | యాజమాన్యాలు తోడ్పాటునందించాలి
భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని కొత్త ప్రయోగాలు చేసేలా యాజమాన్యం తోడ్పాటును అందించాలని కలెక్టర్ సూచించారు. అప్పుడే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ బయటకు వస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణతో విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సంతోష్, శ్రీదేవి, ప్రిన్సిపాల్ ఆంథోని, లత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.