అక్షర టుడే, నిజాంసాగర్: Nizamsagar | బస్సులో నుంచి కిందపడి విద్యార్థికి గాయాలైన ఘటన మండలకేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ నగర్ (mahammad nagar) మండలం గాలిపూర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి అచ్చంపేట (Achampet) ఆదర్శ పాఠశాలలో చదువుతున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం పాఠశాల ముగిసిన తర్వాత నిజాంసాగర్ గాంధీ చౌరస్తా వద్ద కామారెడ్డి వైపు వెళ్లే బస్సు అనుకుని.. పిట్లం వైపు వెళ్లే బస్సు ఎక్కాడు. దీంతో బస్సు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో విద్యార్థి కాలు విరగగా.. స్థానికులు కుటుంబీకులకు సమాచారమిచ్చారు. అలాగే ఆదర్శ పాఠశాల (Aadarsha patashala) ప్రిన్సిపాల్ కార్తీక సంధ్య చేరుకుని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు.
