అక్షరటుడే, ఇందూరు: Fee Reimbursement | రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని పీడీఎస్‌యూ అధ్యక్ష, కార్యదర్శులు గౌతం కుమార్, రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీడీఎస్‌యూ (PDSU), ఏఐఎఫ్డీఎస్(AIFDS) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) ఇంటిని శుక్రవారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు.
మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలలు డేంజర్ జోన్లో ఉన్నాయని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్(Fee Reimbursement), స్కాలర్షిప్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ (Best Available School Schemes) బకాయిలు పేరుకుపోయాయన్నారు.
నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయవద్దని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకొని నాలుగో టౌన్‌కు తరలించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు కార్తీక్, ప్రిన్స్, ఏఐఎఫ్డీఎస్ నాయకులు రాజశేఖర్, పీడీఎస్‌యూ జిల్లా నాయకులు మనోజ్, సాయినాథ్, రాహుల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.