Homeతాజావార్తలుKavitha Janam Bata | యూనివర్సిటీల్లో విద్యార్థి ఎన్నికలు పెట్టాలి.. కవిత డిమాండ్​

Kavitha Janam Bata | యూనివర్సిటీల్లో విద్యార్థి ఎన్నికలు పెట్టాలి.. కవిత డిమాండ్​

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనంబాట కార్యక్రమంలో భాగంగా నల్గొండలో పర్యటించారు. సామాజిక తెలంగాణతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Janam Bata | రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థి ఎన్నికలు పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆమె బుధవారం నల్గొండ జిల్లా (Nalgonda District)లో పర్యటించారు.

కవిత నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital)ని సందర్శించారు. రోగులతో మాట్లాడారు. సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. విశ్వవిద్యాలయాలలో విద్యార్థి ఎన్నికలు కొత్త నాయకులను తయారు చేస్తాయన్నారు. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో అలాంటి ఎన్నికలు రద్దు చేశారని ఆమె పేర్కొన్నారు. దీతో ప్రస్తుతం రాజకీయ నాయకుల పిల్లలకు మాత్రమే పొలిటిక్స్​లో అవకాశాలు వస్తున్నాయన్నారు. మిగతా వారికి ఛాన్స్​లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో ఎన్నికలు పెడితే కొత్త తరం రాజకీయ నాయకులు తయారు అవుతారని చెప్పారు.

Kavitha Janam Bata | సామాజిక తెలంగాణతో..

సామాజిక తెలంగాణ ద్వారా మాత్రమే సమాన అవకాశాలు, సమాన రాజకీయ స్థానాలను సాధించగలమని కవిత అన్నారు. సామాజిక తెలంగాణ కోసం జాగృతి పోరాటం చేస్తుందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న దళితులపై సైతం వివక్ష కొనసాగుతోందన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీల పట్ల రాష్ట్రంలో ఇంకా వివక్ష ఉందన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా నిర్వాసితులైన కుటుంబాలకు 11 సంవత్సరాలు గడిచినా న్యాయం జరగలేదని కవిత పేర్కొన్నారు. డిండి నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. మహిళలకు తెలంగాణ జాగృతి (Telangana Jagruti) ఆధ్వర్యంలో శిక్షణనిస్తామన్నారు. జాగృతి సంస్థను బలోపేతం చేసుకోవడంతో పాటు జిల్లాల్లోని సమస్యలను తెలుసుకోవడానికి జనంబాట నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Kavitha Janam Bata | ఎక్కడి సమస్యలు అక్కడే

గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ (Congress) పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని కవిత విమర్శించారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా.. నల్గొండకు కృష్ణా జలాలు తెచ్చుకోలేకపోయామన్నారు. సుంకిశాల రిటైనింగ్​ వాల్​ కూలిపోతే ప్రభుత్వం కాంట్రాక్ట్​ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

Kavitha Janam Bata | కవిత ఫ్లెక్సీల తొలగింపు

కవిత (Kalvakuntla Kavitha) పర్యటన నేపథ్యంలో జాగృతి నాయకులు మంగళవారం రాత్రి నల్గొండలో ఫ్లెక్సీలుచ హోర్డింగ్​లు ఏర్పాటు చేశారు. అయితే రాత్రి సమయంలో వాటిని మున్సిపల్ అధికారులు తొలగించారు. కొన్ని చోట్ల ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. దీనిపై కవిత స్పందిస్తూ ఫ్లెక్సీల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Must Read
Related News