Homeజిల్లాలుకామారెడ్డిNizamabad City | తండ్రి మందలించాడని గడ్డిమందు తాగిన విద్యార్థి.. చికిత్స పొందుతూ మృతి

Nizamabad City | తండ్రి మందలించాడని గడ్డిమందు తాగిన విద్యార్థి.. చికిత్స పొందుతూ మృతి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad City | బాగా చదువుకోవాలని తండ్రి మందలించగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్​ (Nirmal) జిల్లా నర్సాపూరం గ్రామానికి చెందిన సిందే శివకుమార్​ నిజామాబాద్​ పాలిటెక్నిక్​ కళాశాలలో (Polytechnic College) రెండో సంవత్సరం చదువుతున్నాడు.

అయితే సెకండ్​, థర్డ్​, ఫోర్త్​ సెమిస్టర్లలో సబ్జెక్టులు ఫెయిల్​ కావడంతో తండ్రి బాగా చదువుకోవాలని మందలించాడు. కాగా.. వారం క్రితం శివకుమార్​ సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Exams) రాయడానికి నిజామాబాద్​కు వచ్చాడు. 6వ తేదీన దాస్​నగర్ (Dasnagar)​ శివారులో గడ్డిమందు తాగి తిరిగి హాస్టల్​కు వెళ్లి వాంతులు చేసుకున్నాడు. దీంతో విద్యార్థులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శివకుమార్​ ఆదివారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.