Homeజిల్లాలునిజామాబాద్​Collector Vinay Krishna Reddy | విద్యార్థి వివరాలను యూడైస్​లో నమోదు చేయాలి

Collector Vinay Krishna Reddy | విద్యార్థి వివరాలను యూడైస్​లో నమోదు చేయాలి

పాఠశాలల్లో ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్​లో నమోదు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలో గురువారం విద్యా శాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Collector Vinay Krishna Reddy | అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలను యూడైస్​లో నమోదు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం విద్యా శాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల వివరాలు నమోదు చేయడంలో అలసత్వం వహించకూడదని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అవసరమైన విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్​గ్రేడ్​ (Aadhaar biometric upgrade) చేయించాలన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి అపార్ జెనరేట్ చేయాలని సూచించారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలలో కూడా వివరాల నమోదు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తయ్యేలా చూడాలన్నారు. గడువులోపు వివరాలు నమోదు చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, యూడైస్ వివరాలతో సరిపోలి ఉండాలన్నారు.

Collector Vinay Krishna Reddy | ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి

ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రతి విద్యా సంస్థ (educational institution) విధిగా పాటించాలని కలెక్టర్​ ఆదేశించారు. బడి పిల్లలకు సామర్థ్యానికి మించి బరువుతో బ్యాగులు లేకుండా చూడాలన్నారు. విద్యార్థుల భద్రతకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పైఅంతస్తులోని తరగతి గదులకు వెళ్లాల్సి ఉన్న పాఠశాలల్లో మెట్లకు ఇరువైపులా పటిష్టమైన రెయిలింగ్ ఉండాలని చెప్పారు. విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు, సిబ్బంది హాజరును ముఖ గుర్తింపు విధానం (ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.