Homeజిల్లాలుకామారెడ్డిInter Results | ఇంటర్​లో ఫెయిల్​ అయ్యానని.. విద్యార్థిని సూసైడ్​

Inter Results | ఇంటర్​లో ఫెయిల్​ అయ్యానని.. విద్యార్థిని సూసైడ్​

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి:Inter Results | తల్లిదండ్రులు లేకున్నా ఈ విద్యార్థిని(Student) నానమ్మ దగ్గర ఉంటూ కష్టపడి చదువుకుంది.. నానమ్మే అన్నీతానై చూసుకుంది. అయితే ఇంటర్​లో ఫెయిల్​(Inter fail) కావడంతో దిగులుపడి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రెడ్డి పూజ(17)కు తల్లిదండ్రులు లేరు. నానమ్మతో ఉంటుంది. కామారెడ్డి పట్టణంలోని ఆర్యభట్ట జూనియర్ కళాశాల(Aryabhatta Junior College)లో ఇంటర్​ ఫస్టియర్​ ఎంపీసీ(MPC) చదువుతోంది.

మంగళవారం విడుదలైన ఫలితాల్లో(Inter Results) పూజ ఫెయిలైంది. ఇంట్లో నానమ్మ లేకపోవడంతో తన పెద్దమ్మ ఇంట్లో నిద్రించింది. తాను ఇంటర్​ ఫస్టియర్(Inter First Year)​లో ఫెయిలయ్యానని చెప్పుకుని బాధపడింది. ఉదయం ఇంటిముందు వాకిలి ఊడ్చి వస్తానని వెళ్లిన పూజ తిరిగి రాకపోయేసరికి పెద్దమ్మ వెళ్లి చూడగా.. అప్పటికే ఒళ్లంతా కాలిపోయి విగతజీవిగా పడి ఉంది. వెంటనే స్థానికులు పోలీసులకు(Police) సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి(Hospital)కి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News