అక్షరటుడే, ఇందూరు: Intermediate Education | కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెరిగే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ (DIEO Ravi kumar) అన్నారు.
నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను (Government Boys Junior College) శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు కమిషనర్ (Inter Board Commissioner) ఆదేశాల మేరకు విద్యార్థులకు ఫేషియల్ బయోమెట్రిక్ అటెండెన్స్ (Biometric Attendance) విధానాన్ని అమలు చేయాలని అన్నారు.
సెకండియర్ విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా బోధించాలని.. అప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతామని పేర్కొన్నారు. చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థి డేటాను ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతో పాటు అపార్, పెన్ నెంబర్లను నమోదు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ ఖాలిక్ సిబ్బంది పాల్గొన్నారు.