Homeజిల్లాలుకామారెడ్డిkamareddy Police | ఆన్​లైన్​ గేమ్​కు బానిసగా మారి.. చోరీకి పాల్పడిన విద్యార్థి

kamareddy Police | ఆన్​లైన్​ గేమ్​కు బానిసగా మారి.. చోరీకి పాల్పడిన విద్యార్థి

ఆన్​లైన్​ గేమ్​లకు బానిసగా మారిన ఓ విద్యార్థి చోరీలకు పాల్పడ్డాడు. ఈ మేరకు కామారెడ్డి సబ్​డివిజన్​ ఏఎస్పీ వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: kamareddy Police | ఆన్​లైన్​ గేమ్​కు (online games) బానిసై, ఇతర చోట్ల అప్పులు చేసి వాటిని తీర్చేందుకు చోరీలకు పాల్పడ్డాడు ఓ విద్యార్థి. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వృద్ధురాలు కొండ లలిత వివేకానంద కాలనిలో నివాసం ఉంటుంది.

మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ యువకుడు వృద్ధురాలిని మంచినీళ్లు ఇవ్వాలని అడిగాడు. ఇంట్లోకి వెళ్లి నీళ్లు తెచ్చి ఇచ్చే సమయంలో ఆమె మెడలో ఉన్న గొలుసు లాక్కుని పారిపోయాడు.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టారు. అయితే కాలనీలో ఓ అనుమానిత వ్యక్తి తిరుగుతున్నట్లుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాల (CCTV cameras) ద్వారా అతన్ని పట్టుకున్నారు. అతడిని నాందేడ్ (Nanded) జిల్లా ముగావ్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల దుయ్యవార్ రోహిత్ మారుతిగా పోలీసులు గుర్తించారు.

అయితే ఆ యువకుడు నీట్ పరీక్ష రాసి వెటర్నరీ సీటు పొందాడని ఏఎస్పీ తెలిపారు. ఆన్​లైన్​ గేమ్స్​కు అలవాటు పడి తండ్రి వద్ద రూ.20 వేలు, స్నేహితుని వద్ద రూ.40 వేల తీసుకున్నాడని, అప్పులు తీర్చే మార్గం లేక డిప్రెషన్​లోకి వెళ్లి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడని పేర్కొన్నారు. నాందేడ్ నుంచి రైలులో వచ్చి వృద్ధురాలి మెడలో చైన్ దొంగిలించాడని తెలిపారు. యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

ఒంటరి మహిళలు, వృద్ధులు అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని ఏఎస్పీ సూచించారు. అలాగే యువత ఆన్​లైన్​ గేమింగ్​కు దూరంగా ఉండాలని, వాటికి అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు. కొద్దినెలల క్రితం ఆన్​లైన్​​ గేమింగ్​కు అలవాటు పడి అప్పులపాలై సాఫ్ట్​వేర్​ ఉద్యోగి (software employee) ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి, ఎస్సై బాల్​రెడ్డి పాల్గొన్నారు.

Must Read
Related News