Homeతెలంగాణgutha sukender reddy | న‌ల్గొండ జిల్లాలో ఆధిప‌త్య పోరు.. మంత్రుల‌పై అలిగిన మండ‌లి చైర్మ‌న్‌

gutha sukender reddy | న‌ల్గొండ జిల్లాలో ఆధిప‌త్య పోరు.. మంత్రుల‌పై అలిగిన మండ‌లి చైర్మ‌న్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: gutha sukender reddy | న‌ల్గొండ జిల్లా రాజ‌కీయాల్లో Nalgonda district politics ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. మంత్రుల‌కు ministers, మండ‌లి చైర్మ‌న్‌కు board chairman అస‌లే పొస‌గ‌డం లేదు. క‌నీస ప్రొటోకాల్ protocol పాటించ‌డం లేద‌ని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి Chairman Gutha Sukender Reddy అల‌క బూనారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు పిల‌వ‌డం లేద‌ని, దీని వెనుక ఆ ఇద్ద‌రు మంత్రులే ఉన్నార‌ని సీఎంకు ఫిర్యాదు చేశారు. మంత్రులు, మండ‌లి చైర్మ‌న్ నడుమ లొల్లి ముద‌ర‌డం న‌ల్గొండ జిల్లాలో Nalgonda district రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారింది.

gutha sukender reddy | కాంగ్రెస్‌తో గుత్తా స‌ఖ్య‌త‌

మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి Council Chairman Gutta Sukhender Reddy గ‌తంలో చాలా సంవ‌త్స‌రాలు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఎంపీగా తెలంగాణ Telangana కోసం పోరాడారు. అయితే, కేసీఆర్ ప్ర‌భుత్వం KCR government వ‌చ్చిన త‌ర్వాత గుత్తా పార్టీ మారారు. బీఆర్ఎస్‌లో BRS చేరిన ఆయ‌న మండ‌లి చైర్మ‌న్ అయ్యారు. మొన్నటి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం congress government రావ‌డంతో గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి Gutta Sukhender Reddy డోలాయ‌మానంలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్‌కు BRS  దూరంగా ఉంటూనే, కాంగ్రెస్‌తో congress స‌ఖ్య‌త‌గా ఉంటూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం కౌన్సిల్ చైర్మ‌న్‌గా council chairman ఉన్న ఆయ‌న నేరుగా పార్టీ మార‌క‌పోయినా ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు.

gutha sukender reddy | దూరం పెడుతున్న మంత్రులు..

న‌ల్గొండ‌లో nalgonda రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌. ఈ జిల్లాలో ఎంతో మంది నాయ‌కులు రాష్ట్ర రాజ‌కీయాల్లో state politics త‌న‌దైన ముద్ర వేశారు. ఇక్క‌డి నుంచే ఇద్ద‌రు మంత్రులు కేబినెట్‌లో cabinet ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. జిల్లాలో జ‌రిగే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్రొటోకాల్ protocol ప్ర‌కారం మండ‌లి చైర్మ‌న్‌ను పిల‌వాల్సి ఉండ‌గా, కావాల‌నే దూరం పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలవడం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి gutta sukhender reddy అల‌క బూనారు.

gutha sukender reddy | వ‌ర్క్ ఆర్డ‌ర్లు ర‌ద్దు..

నల్గొండ జిల్లాకు nalgonda district చెందిన‌ ఇద్దరు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి Uttam Kumar Reddy, కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి Komatireddy Venkat Reddy పాల్గొనే కార్యక్రమాల‌కు తనను పిలవట్లేదని సీఎంకు ఫిర్యాదు చేశారు. మండలి చైర్మన్, ఎమ్మెల్సీ అయిన తనకు ప్రోటోకాల్ పాటించకుండా కలెక్టర్ సైతం ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదని వాపోయారు. నల్గొండ జిల్లాలో nalgonda district ఎమ్మెల్సీ కోటాలో రూ.4 కోట్ల పనులను గుత్తా ప్రతిపాదించగా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు minister Tummala Nageswara Rao ఆమోదించారు. నల్గొండ కలెక్టర్ Nalgonda collector ఆర్డర్ కాపీ ఇవ్వగా, పనులు కూడా ప్రారంభమ‌య్యాయి.

అక‌స్మాత్తుగా ఏమైందో ఏమో కానీ గుత్తాకు సమాచారం ఇవ్వకుండానే వర్క్ ఆర్డర్లు రద్దు చేశారు. దీంతో మనస్తాపం చెందిన గుత్తా.. అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కలెక్టర్‌కు సభా హక్కుల నోటీస్ notice ఇవ్వగా కోమటిరెడ్డి Komati Reddy జోక్యంతో ఇలా జరిగిందని వివరణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి Gutta Sukhender Reddy అగ్గి మీద గుగ్గిల‌మ‌య్యారు. కావాల‌నే త‌న‌ను అవ‌మానిస్తున్నార‌ని అలిగిన ఆయ‌న సీఎంకు ఫిర్యాదు చేశారు. న‌ల్గొండలో జ‌రుగుతున్న‌ రాజ‌కీయ ఆధిప‌త్య పోరును రేవంత్‌రెడ్డి Revanth Reddy ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.

Must Read
Related News