అక్షరటుడే, ఇందూరు: MP Arvind | నగరంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ (CCS constable Pramod) దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. నడిరోడ్డుపై ఓ రౌడీషీటర్ పోలీస్ కానిస్టేబుల్ను (police constable) హత్య చేయడం దారుణమన్నారు.
MP Arvind | కాంగ్రెస్ పాలనలో అధ్వాన్నస్థితిలో శాంతిభద్రతలు..
తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పాలనలో శాంతిభద్రతలు అధ్వానస్థితికి చేరాయని ఎంపీ అర్వింద్ (MP Arvind) ఆరోపించారు. ఆఖరకు పోలీస్ సిబ్బందికి కూడా భద్రత లేని పరిస్థితి తయారైందని పేర్కొన్నారు. రౌడీషీటర్లు ఏకంగా పోలీసులపైనే దాడులు చేసే పరిస్థితి వచ్చిందని.. ఇది ఆందోళనకరమైన విషయమన్నారు.
MP Arvind | వెంటనే నిందితుడిని పట్టుకోవాలి..
కానిస్టేబుల్ను హత్యచేసిన నిందితుడు రియాజ్ను త్వరగా పట్టుకోవాలని.. బాధిత పోలీసు కుటుంబానికి న్యాయం చేయాలని ఎంపీ కోరారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు లొంగకుండా.. నేరస్థుడికి కఠినశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.