అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | గ్లోబల్ మార్కెట్లు (Global Markets) కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ రంగ స్టాక్స్ విశేషంగా రాణించడంతో మన మార్కెట్లూ భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 573 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో ముగిశాయి.
రూపాయి బలహీనంగా ఉన్నా.. పీఎస్‌యూ, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ విశేషంగా రాణించడంతో ప్రధాన సూచీలు పరుగులు తీశాయి. పలు సూచీలు రికార్డు స్థాయి గరిష్టాలను తాకాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 71 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా 191 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 744 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 9 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే నష్టాల్లోకి జారుకుని 37 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి పుంజుకుని 222 పాయింట్లు లాభపడిరది. చివరికి సెన్సెక్స్ 573 పాయింట్ల లాభంతో 85,762 వద్ద, నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 26,328 వద్ద స్థిరపడ్డాయి.
ఆల్‌టైం హైకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ..
నిఫ్టీ మరోసారి ఆల్‌టైంహైకి చేరింది. క్రితం ఆల్‌టైం హై 26,325 కాగా.. ఈ రోజు సెషన్లో ఆ మార్క్‌ను దాటింది.
బ్యాంకింగ్ రంగానికి సంబంధించి క్యూ3 అప్డేట్స్ పాజిటివ్‌గా ఉండడంతో బ్యాంక్ స్టాక్స్ పరుగులు తీశాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ (Bank Nifty) సైతం ఆల్‌టైం హైకి చేరింది. క్రితం గరిష్ట స్థాయి అయిన 60,114 ను దాటింది. యస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు బ్యాంక్ నిఫ్టీని ముందుకు నడిపించాయి.
సెన్సెక్స్ జీవితకాల గరిష్టానికి మరో నాలుగు వందల పాయింట్ల దూరంలో ఉంది.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,772 కంపెనీలు లాభపడగా 1,449 స్టాక్స్ నష్టపోయాయి. 150 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 185 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 83 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 5 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
ఎఫ్ఎంసీజీలో ఆగని అమ్మకాలు..
ఎఫ్ఎంసీజీ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.12 శాతం నష్టపోయింది. యుటిలిటీ ఇండెక్స్ 2.71 శాతం, పవర్ 2.26 శాతం, పీఎస్‌యూ 2.02 శాతం, ఎనర్జీ 1.58 శాతం, ఇన్ఫ్రా 1.56 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.53 శాతం, మెటల్ 1.46 శాతం, రియాలిటీ 1.46 శాతం, ఆటో 1.01 శాతం లాభపడ్డాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.97 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.79 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.78 శాతం పెరిగాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 25 కంపెనీలు లాభపడగా.. 5 కంపెనీలు నష్టపోయాయి. ఎన్టీపీసీ 4.67 శాతం, ట్రెంట్ 2.58 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.84 శాతం, పవర్‌గ్రిడ్ 1.57 శాతం, ఎస్బీఐ 1.49 శాతం లాభపడ్డాయి.
Losers : ఐటీసీ 3.79 శాతం, కొటక్ బ్యాంక్ 1.04 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.36 శాతం, ఎయిర్టెల్ 0.09 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.01 శాతం నష్టపోయాయి.