Homeజిల్లాలునిజామాబాద్​All India Forward Bloc Party | సమ సమాజ స్థాపనకు కృషి

All India Forward Bloc Party | సమ సమాజ స్థాపనకు కృషి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: All India Forward Bloc Party | సమసమాజ స్థాపనకు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కృషి చేస్తోందని జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ అన్నారు. పార్టీ 86వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose) 1939 జూన్ 22న పార్టీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సమ సమాజ స్థాపన కోసం ఆయన ఆశయ సాధన కోసం పార్టీ పనిచేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలన్నారు. ప్రజల పక్షాన ఏఐఎఫ్​బీ పోరాటం చేస్తోందని చెప్పారు.