Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

Kamareddy SP | నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SP | జిల్లాలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రాజేష్‌ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష (Review) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పీఎస్‌ల పరిధిలో పెండింగ్‌ కేసుల వివరాలు తెలుసుకున్నారు. నాణ్యమైన దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం అందించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించారన్నారు. గ్రామాల్లో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలని, సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. రైడీషీటర్ల పట్ల కఠిన వైఖరి, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉండాలన్నారు. వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌ రావు, విఠల్‌ రెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ తిరపయ్య, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.