అక్షరటుడే, ఇందూరు: Election Expenses | మున్సిపల్ ఎన్నికల (Municipal Election) ప్రచార ఖర్చులపై పకడ్బందీగా నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు కిషన్ పమర్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ల (District Collectorate) సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Election Expenses | ఏఈవోలు పర్యవేక్షణ చేయాలి..
ఈ సందర్భంగా పరిశీలకుడు మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఏఈవోల బృందాలు (AEO teams) అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార ఖర్చులు ప్రతి అభ్యర్థి ఖాతాలో ఖచ్చితంగా నమోదు చేయాలని ఎన్నికలను ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
Election Expenses | డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెట్టాలి..
డబ్బు మద్యం విలువైన వస్తువులు అక్రమంగా పంపిణీ చేయకుండా నిఘా ఉంచాలని ఆయన అన్నారు. అనుమానాస్పద లావాదేవీలు, బల్క్‌గా సరఫరా అవుతున్న వస్తువులు, నగదు కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు. వ్యయ నియంత్రణలో భాగంగా ఆయా బృందాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నోడల్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ (Nodal Officer Anand Kumar), సంబంధిత అధికారులు పాల్గొన్నారు.