అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | బక్రీద్ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య(CP Saichaitanya) తెలిపారు. గురువారం సాయంత్రం బోధన్ సబ్ డివిజన్(Bodhan sub division) పరిధిలోని కోటగిరి మండలంలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టును కమిషనర్ తనిఖీ చేశారు. చెక్‌పోస్టు వద్ద గల సిబ్బందితో మాట్లాడారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. ప్రతి వాహనం కాగితాలు పరిశీలించాలని చెప్పారు. ఆయన వెంట ఏసీపీ శ్రీనివాస్(ACP Srinivas), రుద్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, కోటగిరి ఎస్సై సునీల్, చెక్‌పోస్టు సిబ్బంది ఉన్నారు.
