HomeతెలంగాణOperation Sindoor | అలా చేస్తే కఠిన చర్యలు.. పోలీసుల హెచ్చరిక

Operation Sindoor | అలా చేస్తే కఠిన చర్యలు.. పోలీసుల హెచ్చరిక

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack కి ప్రతీకారంగా భారత్​ పాకిస్తాన్​లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. కేంద్ర ప్రభుత్వం central govt ఆపరేషన్​ సిందూర్ operation sindoor ​పేరిట చేపట్టిన ఈ చర్యను యావత్​ భారతం స్వాగతిస్తోంది. అయితే కొందరు మాత్రం ఆపరేషన్​ సిందూర్​కు వ్యతిరేకంగా సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారికి తెలంగాణ పోలీసులు telangana police హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్​ సిందూర్ operation sindoor ​కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఆపరేషన్​ సిందూర్​పై దుష్ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేస్తామంది. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది.