Homeజిల్లాలుకామారెడ్డిLocal Body Elections | ఎన్నికల కోడ్​ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Local Body Elections | ఎన్నికల కోడ్​ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

అక్షరటుడే, కామారెడ్డి: Local Body Elections | జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) హెచ్చరించారు. కలెక్టరేట్ మందిరంలో మంగళవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయన్నారు.

ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఇప్పటికే నియయించినట్లు స్పష్టం చేశారు. పోలింగ్ ఆఫీసర్లు(Polling officers), అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన పోస్టర్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగించనున్నట్లు తెలిపారు.

జిల్లాలో ఎన్నికల కోడ్ (Election Code) పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. పోస్టర్లు, హోర్డింగ్స్, ప్రకటనల కోసం ముందస్తుగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఆర్డీఓ, సర్పంచ్, వార్డు మెంబర్లకు తహశీల్దార్ నుంచి అనుమతి పొందాలన్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 5 వేల పైన ఉన్న జనాభా ప్రాంతాల్లో రూ.2.5 లక్షలు, 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో రూ.1.5 లక్షలు అభ్యర్థుల ఖర్చుగా నిర్ణయించినట్లు తెలిపారు. సర్పంచ్​లకు రూ.50 వేలు, వార్డు సభ్యులకు రూ.30 వేలు వరకు ఖర్చు చేయవచ్చన్నారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాహనదారుల వద్ద రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే సీజ్ చేస్తామని తెలిపారు. ఎన్నికలకు 48 గంటల ముందుగానే ప్రచారం నిలిపివేయాలని సూచించారు.