Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | సెటిల్​మెంట్లకు పాల్పడితే కఠిన చర్యలు..

Nizamabad City | సెటిల్​మెంట్లకు పాల్పడితే కఠిన చర్యలు..

చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, సెటిల్​మెంట్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ హెచ్చరించారు. రౌడీషీటర్లకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, సెటిల్ మెంట్లకు (settlements) పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ హెచ్చరించారు. సీపీ ఆదేశానుసారం టూ టౌన్, నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు (rowdy sheeters) శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన ఘటనలకు, ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సత్ప్రవర్తనతో మెలిగే వారి పైన రౌడీ షీట్లు క్లోజ్ చేస్తామన్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే రౌడీ షీట్లు కొనసాగించడంతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు, పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టూ టౌన్ ఎస్సై ముజాహిద్, నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్, ఉదయ్ పాల్గొన్నారు.