అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DGP Shivadhar Reddy | రాష్ట్రంలో ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయం(DGP Office)లో బుధవారం ఉదయం 9:44 గంటలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు తీసుకున్నారు.
తనను డీజీపీగా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు శివధర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. అయితే ఫేక్ న్యూస్ ప్రచారం చేసినా, సోషల్ మీడియాలో ఇష్టారీతినా పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృధికి, పెట్టుబడులు రాకకు లా అండ్ ఆర్డర్ ఎంతో కీలకం అని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను(Local Body Elections) సజావుగా నిర్వహిస్తామన్నారు.
DGP Shivadhar Reddy | మావోయిస్టులు లొంగిపోవాలి
మావోయిస్టుల విధానాలు సక్సెస్ కాలేదని డీజీపీ అన్నారు. లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలో మావోయిస్ట్ మల్లోజుల లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. నక్సల్స్ బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యురాలు సుజాత ఇటీవలే లొంగిపోయారని చెప్పారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అందిస్తామని తెలిపారు.
DGP Shivadhar Reddy | 17 వేల పోస్టులు ఖాళీ
పోలీస్ శాఖలో 17 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీ తెలిపారు. వాటిని భర్తీ చేయాలన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతామన్నారు. పోలీస్ సిబ్బంది నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమాలు చేపడుతామన్నారు.