అక్షరటుడే, కామారెడ్డి: Collector Ashish Sangwan | రైస్‌మిల్లర్లు సీఎంఆర్(CMR) డెలివరీ త్వరితగతిన పూర్తిచేసి ఇవ్వాలని లేకపోతే కఠినచర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో రైస్‌మిల్లర్లు (Rice millers), సివిల్ సప్లయ్స్ (Civil Supply Department) అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సీఎంఆర్ డెలివరీని త్వరితగతిన పూర్తి చేసి, బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించాలని ఆదేశించారు.
ప్రభుత్వం రబీ 2023-24కు సంబంధించి 27 జూలై 2025 వరకు గడువు ఇచ్చిందని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్ (Additional Collector Victor), సివిల్ సప్లయ్స్ జిల్లా మేనేజర్ రాజేందర్, డీసీఎస్వో మల్లిఖార్జున బాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, జిల్లా రైస్ మిల్లర్ కార్యవర్గం, జిల్లాలోని బాయిల్డ్, రా రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.
అనంతరం కలెక్టర్ యాచారం గ్రామంలో భూభారతి (Bhubarathi) రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా యాచారం, వజ్జపల్లి తండాల్లో మొక్కలు నాటారు. ఏఎంసీ ఛైర్మన్ సంగ్య నాయక్, ఆర్డీవో వీణ, మండల ప్రత్యేకాధికారి సతీష్ యాదవ్, హౌజింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లయ్స్ అధికారి మల్లికార్జున బాబు, ఎంపీడీవో సంతోష్ కుమార్, తహశీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.