అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మోటర్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం డ్రంకన్ డ్రైవ్లో (Drunk Drive) మొదటి సారి పట్టుబడితే కోర్టులో రూ. 10వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు.
కొన్ని సందర్భాల్లో జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొన్నారు. ఇక రెండో సారి పట్టుబడిన వారికి రూ.15వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడతాయన్నారు. లేదంటే రెండు కూడా విధించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు (Traffic Regulations) పాటించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) లేకుండా వాహనం నడిపితే కేసు నమోదవుతుందన్నారు. ఈ కేసులో పదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారన్నారు. అందుకే ప్రతి వాహనాదారుడు రోడ్డు భద్రత నియమాలు తూచా తప్పకుండా పాటించాలని సీపీ సూచించారు.