అక్షరటుడే, గాంధారి: Gandhari | అటవీ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఆంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం గాంధారి మండలంలోని తిమ్మాపూర్ శివారులో చదును చేసిన అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. విచారణ అనంతరం సోమారం తండాకు చెందిన జాట్రోతు శ్రీను, గుడివెనక తండాకు చెందిన బానోతురంగు ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.