Homeజిల్లాలుకామారెడ్డిBanswada | కాల్వలు, చెరువులు ఆక్రమిస్తే కఠినచర్యలు

Banswada | కాల్వలు, చెరువులు ఆక్రమిస్తే కఠినచర్యలు

చెరువులను ఆక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. బాన్సువాడలోని ఎల్లయ్య చెరువును శనివారం పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | చెరువులను ఆక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. బాన్సువాడ పట్టణంలోని (Banswada town) ఎల్లయ్య చెరువును పరిశీలించారు.

చెరువు, కుంటలు కబ్జా అవుతుండడంపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గతంలో స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో నాయకులు నేరుగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డిని (Uttam Kumar Reddy) కలిశారు. దీంతో చీఫ్​ ఇంజినీర్​ శ్రీనివాస్​ శనివారం చెరువును సందర్శించారు.

ఈ సందర్భంగా 49 ఎకరాల విస్తీర్ణంలో ఉండే చెరువును పలువురు కబ్జా చేస్తుండడాన్ని బీజేపీ నాయకులు చీఫ్ ఇంజినీర్ దృష్టికి తీసుకువచ్చారు. చెరువుకు సంబంధించిన కాల్వలు ఆక్రమణలకు గురయ్యాయని వివరించారు. అధికారుల ఆదేశాలతో సమగ్ర సర్వే నిర్వహించి చెరువును కాపాడేందుకు తక్షణచర్యలు చేపడతామని చీఫ్ ఇంజినీర్ హామీ ఇచ్చారు. కాల్వలు, చెరువు భూములను ఆక్రమించిన వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ప్రసాద్, నాయకులు శంకర్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షుడు అనిల్, వెంకట్, సాగునీటి శాఖ అధికారులు, పాల్గొన్నారు.

Must Read
Related News