ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | బాలలపై లైంగిక దాడుల విషయంలో కఠిన చర్యలు : సీఎం...

    CM Revanth Reddy | బాలలపై లైంగిక దాడుల విషయంలో కఠిన చర్యలు : సీఎం రేవంత్​ వార్నింగ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | సోషల్ మీడియాలో ద్వారా బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో ఎలాంటి జాలి చూపకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి (Marri Chenna Reddy) మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిస్సహాయకులకు అండగా – లైంగిక దాడికి గురైన పిల్లల రక్షణ, హక్కులు అనే అంశంపై శనివారం సదస్సు నిర్వహించారు. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant), హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ​(Justice Sujay Pal)లో కలిసి సీఎం పాల్గొన్నారు.

    CM Revanth Reddy | రక్షణ కల్పించాలి

    పిల్లలపై జరుగుతున్న హేయమైన నేరాలను నియంత్రించడమే కాకుండా వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వారి రక్షణ కోసం భరోసా ప్రాజెక్టును చేపట్టామని, దీని కింద ప్రస్తుతం 29 కేంద్రాలు పనిచేస్తున్నాయని వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను (Child-Friendly Courts) ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కోర్టుల ద్వారా కేసులను సత్వరం పరిష్కరించడమే కాకుండా పిల్లలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

    CM Revanth Reddy | బాధితులకు న్యాయం దక్కాలి

    పోక్సో చట్టం (POCSO Act), జువెనైల్ చట్టాల (Juvenile Justice Act) ఆచరణలో సమస్యలను అధిగమించాలని సీఎం సూచించారు. ఆ చట్టాలు బాధితులకు ఎలాంటి వేదన కలిగించకుండా ఉండాలన్నారు. న్యాయం కోర్టుల్లోనే కాకుండా ప్రతి దశలోనూ వారికి లభించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ (Police Station), బాలల సంక్షేమ కేంద్రాలతో (Child Welfare Centers) పాటు అన్ని దశల్లోనూ బాధితులకు న్యాయం దక్కాలన్నారు. బాలలై లైంగిక దాడులను నియంత్రించడానికి న్యాయమూర్తులు, పోలీసులు, బాలల సంక్షేమ కమిటీలు, పౌర సమాజంలోని ఇతర భాగస్వామ్య కలిసి ముందుకు సాగాలన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...