అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drug Control Administration | నకిలీ మందులు అమ్మితే ఎంతటివారైనా కఠినచర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ (Drug Control Administration Department) అసిస్టెంట్ డైరెక్టర్ నర్సయ్య హెచ్చరించారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట (Yellammagutta) కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ భవన్లో (Chemist and Druggist Bhavan) సోమవారం జిల్లాలోని మెడికల్ ఏజెన్సీల (Medical agency) నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Drug Control Administration | అధిక లాభాలకు ఆశపడొద్దు..
తాము చేస్తున్న వ్యాపారాన్ని చట్టబద్ధంగా నిర్వహించాలని, అధిక లాభాలకు ఆశపడి నకిలీ మందులు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని సూచించారు. అలాచేస్తే మందుల వ్యాపారంపై ప్రజల్లో నమ్మకం పోతుందని హెచ్చరించారు.
నార్కోటిక్ డ్రగ్స్ (Narcotic drugs), అబార్షన్ కిట్లను సంబంధిత నర్సింగ్ హోంలలోనే అమ్మాలని జనరల్ షాపుల్లో ఎట్టిపరిస్థితుల్లో అమ్మవద్దని ఏడీ నర్సయ్య సూచించారు. విక్రయించిన డ్రగ్స్‌కు సంబంధించిన వివరాలను ప్రతినెలా 3వ తేదీన డ్రగ్స్ కార్యాలయంలో అందజేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, శ్రీలత, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ (Chemist and Druggist Association) జిల్లా అధ్యక్షుడు నల్ల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి బీర్కూర్ సుధాకర్, కోశాధికారి సాయిలు తదితరులు పాల్గొన్నారు.